Tuesday, February 4, 2020

Sammakka sarakka,మేడారం సమ్మక్క సారక్క జాతర

మేడారం సమ్మక్క సారక్క జాతర

 తెలంగాణా కుంభ మేళా

తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగ.సమ్మక్క సారక్క  మహా జాతర  రేపటి నుంచి మొదలు కాబోతుంది. ఈ జాతర నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది.  భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే.వివిధ రాష్ట్రాల నుంచి 1  కోటి మందికిపైగా హాజరవుతారని అంచనా. తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.జాతర ప్రారంభం కావడానికి పది రోజుల ముందు నుంచే ఇక్కడ భక్తులు పోటెత్తుతున్నారు.జాతర ప్రారంభం అయ్యాక ఇక  భక్తులు ఇసుక వేస్తే రాలనంతగా విచ్చేస్తారు.



మేడారం జాతర కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది ప్రత్యేక బస్సులు నలుమూలల నుంచి అందుబాటులో ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా చత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
 ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ పండుగ జరుగుతుంది

 జంపన్న వాగు


 సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు,సమ్మక్క సారక్క,నాగమ్మ,జంపన్న,గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ సురక్షితమైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు,పగిడిద్దరాజు,సారలమ్మ,నాగులమ్మ,గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అప్పటినుండి ప్రసిద్ధి గాంచింది.
 జాతర విశేషాలు
 జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు, రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు,మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథా స్థానానికి తరలిస్తారు  తరువాత జాతర ముగుస్తుంది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. భక్తులు  బంగారం(బెల్లాన్ని)నైవేద్యంగా  సమర్పించుకుంటారు.

No comments:

Post a Comment

CRED rent pay transfer money using credit to bank account

Yes we can transfer money using credit to bank account In  app this CRED has Launched in this Lockdown New option  charges 1.5% directly mo...